తెలంగాణాలో కరోనా విజృంభణ.. మరో 43 మందికి సోకిన వైనం

04-04-2020 Sat 21:18
  • ఈ రోజు ఉదయం వరకు కేసుల సంఖ్య 229
  • ప్రస్తుతం తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 272
  • ఇప్పటివరకు 11 మంది మృతి 
coronavirus cases in telangana

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 43 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 272కు చేరింది. ఈ రోజు ఉదయం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 229గా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకు 32 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ప్రాంతాల్లోనే బాధితులు అధికంగా ఉన్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు, కరోనా కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 190కి చేరింది.