సాయం చేస్తున్నామంటూ.. పాక్‌కు అండర్‌వేర్‌తో చేసిన మాస్కులు పంపిన చైనా.. వీడియో ఇదిగో

04-04-2020 Sat 20:26
  • బయట పెట్టిన పాక్‌ మీడియా
  • చైనా నుంచి పాక్‌కు దాదాపు 2 లక్షల సాధారణ మాస్కులు
  • 2 వేల ఎన్‌-95 మాస్కులు
china sends masks to pak

కరోనాపై పోరులో సాయం చేస్తామని, తమ దేశం నుంచి నాణ్యమైన ఎన్-95 ఫేస్‌మాస్కులు పంపుతామని పాకిస్థాన్‌కు మాటిచ్చిన చైనా లోదుస్తులతో చేసిన మాస్కులు పంపింది. ఈ విషయాన్ని తెలిపిన పాక్‌ మీడియా చైనాపై విమర్శలు చేసింది. చైనా నుంచి పాక్‌కు దాదాపు 2 లక్షల సాధారణ మాస్కులు, 2 వేల ఎన్‌-95 మాస్కులు, 5 వెంటిలేటర్లు, 2 వేల కరోనా టెస్టింగ్ కిట్లు,  2 వేల మెడికల్ సూట్లు వచ్చాయి.

సింధ్‌ ప్రావిన్స్‌ చేరుకున్న వాటిని ఆసుపత్రులకు సరఫరా చేశారు. చైనా నుంచి వచ్చిన బాక్సుల్లో లోదుస్తులతో చేసిన మాస్కులను చూసిన వైద్య సిబ్బంది షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పాక్‌ మీడియా ప్రసారం చేసింది. చైనా చర్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.