మన దేశంలో పరిస్థితి అంత ఘోరంగా లేదు: కేంద్ర ప్రభుత్వం

04-04-2020 Sat 19:37
  • ఇతర దేశాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగిపోయాయి
  • దేశంలో కరోనాను కొంతమేర నియంత్రించగలిగాం
  • కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది
coronavirus cases in india

యూరప్‌ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో పరిస్థితులు చేయి దాటిపోయే స్థితికి వచ్చాయి. ఇతర దేశాలతో పోల్చుకుని చూస్తే భారతదేశంలో కరోనా వ్యాప్తిని మెరుగ్గానే కట్టడి చేశామని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...  ఇతర దేశాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. భారత్‌లో పరిస్థితి అంత ఘోరంగా లేదని, దేశంలో కరోనాను కొంతమేర నియంత్రించగలిగామని చెప్పారు. కరోనా వ్యాప్తి మొదలు కాగానే కేంద్ర ప్రభుత్వం దీనికి ముందు చూపుతో వ్యవహరించిందని తెలిపారు.