Narendra Modi: కరోనాపై కలసి పోరు.. ట్రంప్‌తో మాట్లాడిన మోదీ!

  • ట్విట్టర్‌లో తెలిపిన మోదీ
  • ఫోనులో విస్తృతంగా సంభాషించాను
  • భారత్-అమెరికా కలిసి పూర్తిస్థాయిలో పనిచేయాలని అంగీకారం 
PM Modi speaks to Donald Trump

కరోనా విలయతాండవం చేస్తోన్న అమెరికాలో దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేయడానికి ఇరు దేశాలు వేర్వేరుగా వ్యాక్సిన్‌, ఔషధాలను కనిపెట్టడానికి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఈ రోజు ఫోనులో మాట్లాడుకున్నారు.

'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోనులో విస్తృతంగా సంభాషించాను. ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. కొవిడ్‌-19ను కట్టడి చేయడానికి భారత్-అమెరికా కలిసి పూర్తిస్థాయిలో పనిచేయాలని అంగీకారానికి వచ్చాము' అని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు.

More Telugu News