ఈ నెల 8న ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

04-04-2020 Sat 19:18
  • ఉదయం 11 గంటలకు ప్రారంభం
  • కరోనా విజృంభణ నేపథ్యంలో మాట్లాడనున్న మోదీ
  • ప్రకటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
PM Modi to interact with floor leaders of political parties on April 8 through video conferencing on COVID19

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పలు పార్టీల  ఫ్లోర్‌ లీడర్లతో ఆయన ఈ నెల 8న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు.

'పార్లమెంటులో 5 కన్నా ఎక్కువ సీట్లున్న పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు' అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా, కరోనాపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనుండడం గమనార్హం.