కరెన్సీ నోట్లతో ముక్కు, మూతి తుడుచుకుని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి.. అరెస్టు

04-04-2020 Sat 18:32
  • మహారాష్ట్రలోని నాసిక్ లో ఘటన
  • కరోనా విజృంభణ నేపథ్యంలో చర్య
  • ఏప్రిల్ 7 వరకు కస్టడీ
maharastra man arrested

కరెన్సీ నోట్లతో ముక్కు తుడుచుకుంటూ వీడియో తీసుకుని, టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేశాడో వ్యక్తి. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతడిని అరెస్టు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని కొందరు టిక్‌టాక్‌లో పోస్టులు చేస్తున్నారు.

అయితే, మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ వ్యక్తి (38) తాజాగా ఇలా కరెన్సీ నోట్లతో ముక్కు, మూతి తుడుచుకుంటూ వీడియోను తీసి పోస్ట్ చేశాడు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో అతనిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 7 వరకు అతడికి న్యాయస్థానం కస్టడీ విధించింది. అతడి వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలో నమోదైన విషయం తెలిసిందే.