జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి చూపిద్దాం: నాగార్జున

04-04-2020 Sat 18:15
  • ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేయాలన్న మోదీ
  • దేశమంతా ఒక్కటేనని ఈ సందర్భంగా నిరూపించాలన్న నాగ్
  • కరోనాపై పోరాటం కొనసాగుతుందంటూ సందేశం
Nagarjuna endorses PM Modi call

కరోనా వైరస్ భూతాన్ని రూపుమాపే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి కొద్దిసేపు లైట్లు ఆర్పివేయాలంటూ ఇచ్చిన పిలుపు పట్ల ప్రముఖ సినీ నటుడు నాగార్జున స్పందించారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి, 9 నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫోన్ టార్చిలైట్లు వెలిగించమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జనతా కర్ఫ్యూ రోజున ప్రజలందరూ చూపిన సంఘీభావాన్ని మరోసారి చూపిద్దామని అన్నారు. దేశమంతా ఒక్కటేనని, కరోనాపై మన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మన పోరాట స్ఫూర్తిని మరొక్కసారి చాటుదామని పిలుపునిచ్చారు.