కరోనా కేసుల్లో 41 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే: కేంద్రం

04-04-2020 Sat 16:31
  • 17 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారని కేంద్రం వెల్లడి
  • 20 ఏళ్ల లోపు వారు 9 శాతం ఉన్నారని వివరణ
  • కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రాలు విధిగా పాటించాలని స్పష్టీకరణ
Centre tells who were attacked by corona mostly

భారత్ లో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లేనని కేంద్రం వెల్లడించింది. 17 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవాళ్లని, 9 శాతం మంది 20 ఏళ్ల లోపువారని పేర్కొంది.

కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్ సైట్ లో ఉంచామని, మాస్కులు, చేతి తొడుగుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వెబ్ సైట్ లో పొందుపరిచామని వివరించింది. దేశం మొత్తమ్మీద కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ల నుంచి అత్యంత సమస్యాత్మక కేసులు వస్తున్నాయని వెల్లడించింది. కరోనా నియంత్రణలో కేంద్ర మార్గదర్శకాలు విధిగా పాటించాలని స్పష్టం చేసింది.