ఇంకా ఇలాంటి పోస్టులేనా? వారి గురించి కొంచెం ఆలోచించండి: సానియా మీర్జా

04-04-2020 Sat 16:14
  • లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన ప్రముఖులు
  • వంటల వీడియోలు, ఫుడ్ ఐటమ్స్ తో సోషల్ మీడియాలో సందడి
  • అవతల వేలమంది విలవిల్లాడుతున్నారన్న సానియా
Sania Mirza requests just spare a thought for who struggle with situations

దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమై, వంటింట్లో దూరి గరిటె తిప్పుతున్న, పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీనిపై ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు.

"ఇప్పటికీ మనం వంటల వీడియోలు, ఆహారానికి సంబంధించిన ఫొటోలతోనే సరిపెడుతున్నామా? అవతల వేలమంది ప్రజలు మృత్యుకోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొందరు ఆకలితో ఆలమటిస్తూ ఒక్కపూట తిండి దొరికినా అదృష్టవంతులమే అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఆలోచించండి" అంటూ ట్వీట్ చేశారు.