జిమ్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ

04-04-2020 Sat 16:12
  • పూరితో విజయ్ దేవరకొండ మూవీ 
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన షూటింగ్ 
  • ఇంకా ఖరారు కాని టైటిల్
puri Jagannadh Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ కి తగినట్టుగా విజయ్ దేవరకొండ మంచి ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. అందువలన ఆయన జిమ్ లో గట్టి కసరత్తులు చేస్తూ వస్తున్నాడు.

అయితే కరోనా కారణంగా విధించిన కర్ఫ్యూ కారణంగా జిమ్ లు కూడా మూతబడిపోయాయి. ఒకవేళ అందుబాటులో వున్నా, ప్రస్తుతం వాటిని ఉపయోగించలేని పరిస్థితి. చాలామంది హీరోలు తమ ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకుంటారు. కానీ విజయ్ ఇంకా తన ఇంట్లో జిమ్ సెట్ చేసుకోలేదు. అందువలన వర్కౌట్స్ చేసే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడట. విజయ్ ఫిట్ నెస్ విషయంలో తేడా వస్తే, షూటింగు వాయిదా పడే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.