ఏపీలో ఈ రెండు జిల్లాలను తాకని కరోనా!

04-04-2020 Sat 15:52
  • రాష్ట్రంలో 180కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులు
  • సేఫ్ జోన్ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు
Two districts in AP no witness in corona cases

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా చూస్తే, నెల్లూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 27, కడప జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 18, విశాఖ జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2 నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ రెండు జిల్లాలు ప్రస్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నట్టు అధికారవర్గాలు భావిస్తున్నాయి.