ఏప్రిల్ 6న ప్రధాని నుంచి కీలక నిర్ణయం..?

04-04-2020 Sat 15:33
  • కరోనాపై పోరుకు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని
  • ఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌన్
  • ఏప్రిల్ 6న క్యాబినెట్ సమావేశం
PM Modi to hold a cabinet meeting via video conferencing

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మోదీ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మోదీ దేశంలో కరోనా సహాయకచర్యలు జరుగుతున్న తీరును నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అనేక వ్యవస్థలకు చెందిన ప్రతినిధులతో తాజాగా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా, వైద్యులకు కరోనా నుంచి రక్షణ కల్పించే పీపీఈ యూనిట్లు, మాస్కులు, చేతి తొడుగుల కొరత రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.