లాక్ డౌన్ ను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను: రామ్ చరణ్

04-04-2020 Sat 15:18
  • ఆదివారం రాత్రి 9 గంటకు దీపాలు వెలిగించాలన్న మోదీ
  • ప్రధాని పిలుపును పాటిద్దాం అంటూ చెర్రీ విజ్ఞప్తి
  • ట్విట్టర్ లో వీడియో సందేశం
Ram Charan responds on PM Modi appeal

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్లు వెలిగించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించారు. "లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి మరింత చైతన్యాన్ని పెంచుదాం... మర్చిపోవద్దు" అంటూ ఓ వీడియో సందేశం వెలువరించారు.