మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

04-04-2020 Sat 15:04
  • ఇవాళ కోట్ల సుజాతమ్మ జన్మదినం
  • ఏమాత్రం భేషజం లేని వ్యక్తి అంటూ కొనియాడిన చంద్రబాబు
  • నిండునూరేళ్లు వర్ధిల్లాలంటూ ఆకాంక్ష
Chandrababu wishes Kotla Sujathamma on her birthday

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోట్ల సుజాతమ్మ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రికి కోడలు అయినా, కేంద్ర మాజీమంత్రికి అర్ధాంగి అయినా ఏమాత్రం భేషజం లేని వ్యక్తి అని కోట్ల సుజాతమ్మను కొనియాడారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని, రైతులు, పేదల కోసం పరితపిస్తుంటారని ప్రశంసించారు.

ఇక ముందు కూడా జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కోట్ల సుజాతమ్మ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.