కొన్ని గంటల వ్యవధిలోనే పెరిగిన మరణాలు... భారత్ లో 3 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

04-04-2020 Sat 14:34
  • వేగంగా వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారి
  • దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,188
  • 94కి చేరిన మృతుల సంఖ్య
India witnesses more corona positive cases and deaths

భారత్ లో లాక్ డౌన్ విధించినా కరోనా కేసుల సంఖ్య తగ్గడంలేదు సరికదా, గత కొన్నిరోజుల వ్యవధిలో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయానికి 2902 కేసులు నమోదు కాగా, మధ్యాహ్నం తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య 3,188కి పెరిగింది. అటు మృతుల సంఖ్య ఉదయం 68గా ఉండగా, ఇప్పుడా సంఖ్య 94కి చేరింది.

దీన్నిబట్టే భారత్ లో ఇప్పుడు కీలకదశ నెలకొందని అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ పేరిట ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. అప్పటినుంచి కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో జమాత్ కు హాజరైన వారికోసం అధికారవర్గాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఓ వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జమాత్ కు హాజరైన వారే కావడం గమనార్హం.