Jagan: వారి సేవలు అభినందనీయం.. పూర్తి స్థాయిలో వేతనాలు అందిస్తాం: ఏపీ సీఎం జగన్

  • అధికారులతో జగన్ సమీక్ష 
  • వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు
  • కరోనా వ్యాప్తి కట్టడికి పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో చర్యలు  
jagan on corona

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ముఖ్యమంత్రి జగన్‌ ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు అందించాలని ఈ సమావేశం సందర్భంగా జగన్ నిర్ణయం తీసుకుని ప్రకటన చేశారు.

కరోనా నివారణకు ముందుండి పనిచేస్తోన్న సిబ్బందికి పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వడం ఉత్తమమని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో వారి సేవలు అభినందనీయమని కొనియాడారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలతో కరోనా వ్యాప్తి కట్టడికి పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఆరు వేల చోట్ల హైపోక్లోరైడ్ పిచికారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

More Telugu News