క్రికెటర్ల పెళ్లిళ్లు ‘లాక్‌డౌన్‌’: ఎనిమిది మంది ఆస్ట్రేలియా ఆటగాళ్ల వివాహం వాయిదా

04-04-2020 Sat 13:32
  • ఈ నెలలో వివాహానికి ముహూర్తం
  • ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగడంతో వాయిదా
  • వాయిదా వేసుకున్న ఎనిమిది మంది
australian cricketers marriages postphoned

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలవుతుండడంతో ఈ నెలలో జరగాల్సిన ఎనిమిది మంది క్రికెటర్ల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అక్కడి ఓ పత్రికలో వచ్చిన సమాచారం మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనర్ డి'ఆర్సీ షార్ట్, పేసర్ జాక్సన్ బర్డ్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా, అన్‌కాప్డ్ మిచెల్ స్వెప్సన్, ఆండ్రూ టై, జెస్ జోనాసెన్, అలిస్టర్ మెక్‌డెర్మాట్ మరియు కాట్లిన్ ఫ్రైట్ లు ఈ నెలలో తమ వివాహాలు చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా విజృంభణ నేపధ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా వీరు తమ వివాహాలను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.