Maharashtra: 187 ఏళ్లనాటి చారిత్రక 'అమృతాంజన్‌ వంతెన' నేడు కూల్చివేత

  • ముంబై - పూణే రహదారిని కలుపుతూ ఏర్పాటు
  • 1830లో బ్రిటీష్‌ కాలంలో నిర్మాణం
  • కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయాలని నిర్ణయం
amrutanjan bridge in maharastra demolished today

మహారాష్ట్రలోని చారిత్రక అమృతాంజన్ వంతెనను ఈరోజు కూల్చివేయనున్నారు. ముంబై - పూణేలను కలుపుతూ నిర్మించిన రోడ్డులో లోనావాలా సమీపంలో 187 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చారిత్రాత్మక వంతెన పూర్తి శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని నిర్ణయించారు. ఇందుకు కోర్టు కూడా అనుమతి మంజూరు చేయడంతో లాక్‌డౌన్‌ సమయం సరైనదని ఈ రోజును ఎంచుకున్నారు.

భారతదేశాన్ని బ్రిటీష్‌ వారు పాలిస్తున్న సమయంలో ఈ వంతెనను నిర్మించారు. ప్రస్తుతం వంతెన శిథిలావస్థకు చేరడంతో గత కొంతకాలంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం మహారాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డీసీ) ఈ వంతెనను కూల్చివేసేందుకు రాయ్‌గఢ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకుంది. వంతెన కూల్చివేత నేపథ్యంలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.

నొప్పి నివారిణి అమృతాంజన్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనతో కూడిన భారీ హోర్డింగును 1970లలో ఈ వంతెన వద్ద ఏర్పాటు చేశారు. అది అందర్నీ ఆకర్షించేది. అప్పటి నుంచీ దీనికి 'అమృతాంజన్ బ్రిడ్జ్' అనీ, 'అమృతాంజన్ పాయింట్ బ్రిడ్జ్' అనీ పేరు వచ్చింది.

More Telugu News