Narendra Modi: లైట్లు స్విచ్ఛాప్‌ చేయాలన్న మోదీ నిర్ణయంపై మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు

mamata banerjee mocks modi
  • ఆదివారం రాత్రి 9 గంటలకు నాకు నిద్రొస్తే నేను నిద్రపోతాను
  • మోదీ మీకు చెప్పాడు.. మీరు చెయ్యండి
  • నన్నెందుకు దాని గురించి అడుగుతారు
  • నేనేం చేయగలనో నేను చెబుతాను 
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ’లైట్‌ దియా’ పిలుపుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులో ఏముందో తాను చెబుతారు. నా మనసులో ఏముందో నేను చెబుతాను. ఇతరుల విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ప్రధాని మంచి విషయం చెప్పారని అనుకుంటే మీరు అనుసరించండి. ఇది వ్యక్తిగత నిర్ణయం' అని వ్యాఖ్యానించారు.

'ఆదివారం రాత్రి 9 గంటలకు నాకు నిద్రొస్తే నేను నిద్రపోతాను. మోదీ మీకు చెప్పాడు.. మీరు చెయ్యండి. నన్నెందుకు దాని గురించి అడుగుతారు. నేనేం చేయగలనో నేను చెబుతాను. మోదీ ఏం చేయగలరో ఆయన చెబుతారు. కరోనా వైరస్‌ను అడ్డుకోమంటారా లేక రాజకీయాలు చేయమంటారా? దయచేసి రాజకీయ పోరుకు ఆజ్యం పోయొద్దు' అని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే కరోనా వల్ల కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని ఆమె తెలిపారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
Narendra Modi
Mamata Banerjee
West Bengal
Corona Virus

More Telugu News