విలేజ్‌ వారియర్స్‌ ద్వారా డబ్బు, ఉచిత రేషన్ ఇస్తున్నాం: రోజా

04-04-2020 Sat 12:11
  • దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు
  • ఏపీలో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు తీర్చుతున్నాం
  • రేషన్‌కార్డు ఉన్న వారికి సాయం అందుతోంది
Roja striving to help those who are suffering the most

లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 'దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు తీర్చడానికి ముఖ్యమంత్రి జగన్‌ గారి నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రేషన్‌కార్డు ఉన్న వారికి విలేజ్‌ వారియర్స్‌ ద్వారా రూ.1,000తో పాటు ఉచితంగా రేషన్‌ అందిస్తున్నాం' అని ట్వీట్ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పింఛను లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్న విషయం తెలిసిందే.