కృష్ణా జిల్లాలో బైక్‌పై తిరుగుతూ ప్రజలతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని

04-04-2020 Sat 12:00
  • కృష్ణా జిల్లాలో 27 కరోనా పాజిటివ్‌ కేసులు
  • పరిస్థితులను పరిశీలించిన మంత్రి
  • నిత్యావసరాల పంపిణీ
perni nani in krishna dist

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఆ జిల్లాలోని  మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని ఈ రోజు ఉదయం పర్యటించారు. ఇందుకోసం ఆయన బైక్‌పై తిరుగుతూ లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని పలు కూడళ్ల వద్ద ఉన్న ప్రజలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేదలకు మంత్రి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 180కి చేరింది.