కరోనా నన్ను ఆలోచింపజేసింది: జాన్వీ కపూర్

04-04-2020 Sat 10:43
  • వాళ్లను చూస్తే బాధ కలుగుతోంది 
  • నా బాధ్యతా రాహిత్యం అర్థమైంది 
  • వాళ్ల ఆరోగ్యమే తన ఆరోగ్యమన్న జాన్వీ
Janhvi Kapoor

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన విశ్వరూపం చూపుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలంతా నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి జాన్వీ కపూర్ స్పందించింది. "కరోనా వైరస్ .. లాక్ డౌన్ నాకు ఎన్నో విషయాలను తెలియజేసింది. తినడానికి తిండిలేనివాళ్లు ఆహారం కోసం బయటికి వెళ్లే సాహసం చేస్తుండటం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అలాంటి అభాగ్యులను గురించి ఆలోచించకపోవడం నా బాధ్యతా రాహిత్యం అనిపించింది.

నా కోసం మా నాన్న ఎంతగా ఎదురుచూసేవారో తెలిసింది. మా కుటుంబంపై ఎంతమంది ఆధారపడ్డారో అర్థమైంది. నా రోజువారీ జీవితం సాఫీగా సాగిపోవడానికి వాళ్లే కారణమని గ్రహించినప్పుడు నా మనసు భారమైంది. వాళ్లంతా ఆనందంగా .. ఆరోగ్యంగా వున్నప్పుడే నేను ఆనందంగా ఉంటాననే విషయం నాకు తెలిసొచ్చింది" అని చెప్పుకొచ్చింది.