హృతిక్ రోషన్ అంటే ఇష్టం: పూజ హెగ్డే

04-04-2020 Sat 10:19
  • 'ముకుంద' సినిమా ప్రత్యేకం 
  • 'గోపికమ్మా' పాట ఇష్టం 
  • అదొక తీపిజ్ఞాపకమన్న పూజ హెగ్డే  
Pooja Hegde

తెలుగులో స్టార్ హీరోయిన్ గా పూజ హెగ్డే దూసుకుపోతోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా తన మనసుకు నచ్చిన విషయాలను గురించి ప్రస్తావించింది. "తెలుగులో నేను చేసిన సినిమాల్లో 'ముకుంద' అంటే ఇష్టం. ఆ సినిమాలో నాపై 'గోపికమ్మా' అనే సోలో సాంగ్ వుంది. ఇప్పటికీ ఎక్కడికైనా వెళితే 'గోపికమ్మా' అనే పిలుస్తుంటారు.

ఇక తాజాగా అఖిల్ తో చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లో ' మనసా మనసా .. ' అనే పాట అంటే నాకు ఇష్టం. బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ అంటే ఇష్టం. మనిషి .. మనసు రెండూ అందంగా ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. అలా అందమైన మనసున్న మనిషిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు. ఆయనతో కలిసి 'మొహెంజోదారో' సినిమా చేయడం నా జీవితంలో ఒక తీపి జ్ఞాపకం" అంటూ చెప్పుకొచ్చింది.