శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ'కి భారీ డిమాండ్

04-04-2020 Sat 09:40
  • చైతూ జోడీగా సాయిపల్లవి
  • చెరో హిట్ తరువాత చేస్తున్న చిత్రం 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
Love Story Movie
నాగచైతన్య కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ సినిమాలో చైతూ సరసన నాయికగా సాయిపల్లవి అలరించనుంది. చైతూ కెరియర్లో ఇంతవరకూ చేసిన సినిమాల్లో ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ఆదరణ పొందాయి. ఆయన చేసిన ఆ తరహా కథలు భారీ వసూళ్లను సాధించాయి. అందువలన ఆయన తాజా చిత్రమైన 'లవ్ స్టోరీ'కి మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులు .. ఓవర్సీస్ హక్కులు భారీ రేటు పలుకుతున్నాయట. శేఖర్ కమ్ముల ఇంతకుముందు చేసిన 'ఫిదా' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం, ఆ సినిమాకి ఓవర్సీస్ లో విశేషమైన ఆదరణ లభించడం 'లవ్ స్టోరీ'కి మంచి డిమాండ్ ఏర్పడటానికి మరో కారణమని చెబుతున్నారు. ఇటు చైతూ .. అటు సాయిపల్లవి ఇద్దరూ కూడా చెరో హిట్ పడిన తరువాత చేసిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను వాళ్లు ఎంతవరకూ అందుకుంటారో చూడాలి మరి.