పవన్ సినిమాలో పూజిత పొన్నాడ ఐటమ్ సాంగ్

04-04-2020 Sat 09:16
  • క్రిష్ దర్శకత్వంలో పవన్ 
  • పవన్ సరసన జాక్విలిన్ 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
Krish Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందట. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించారు. జాక్విలిన్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. 'కల్కి' .. 'రంగస్థలం' సినిమాల్లో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆకర్షణీయమైన ఆమె రూపానికి కుర్రకారు ఫిదా అయ్యారు. పవన్ - క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో మరింత పాప్యులర్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.