Uttarakhand: కిటికీ అద్దాలు పగలగొట్టి.. క్వారంటైన్ నుంచి జమాత్ కార్యకర్తల పరారీ

Two Tablighi jamaat workers ran away from quarantine centre in Uttarakhand
  • ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఘటన
  • మర్కజ్ సమావేశానికి హాజరై తిరిగొచ్చిన వైనం
  • గాలిస్తున్న పోలీసులు
క్వారంటైన్ కేంద్రంలో వున్న ఇద్దరు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఆసుపత్రి కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో జరిగిందీ ఘటన. ఢిల్లీలోని మర్కజ్ సమావేశానికి వెళ్లొచ్చిన ఇద్దరు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను గుర్తించిన ఆరోగ్యశాఖ అధికారులు వారిని కాశీపూర్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. నిన్న కేంద్రంలోని కిటికీ అద్దాలు పగలగొట్టి వారు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు, వారు తప్పించుకున్న విషయం తెలిసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Uttarakhand
Kasipur
makaz masjid
Quarantine Centre

More Telugu News