అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమారుల మృతి.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహాలు

04-04-2020 Sat 06:55
  • నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో ఘటన
  • రెండు రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
woman and her son died in Nellore

నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరంలో తల్లీకుమారుల మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు, నడివయసులో ఉన్న ఆమె కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత రెండు రోజులుగా వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మృతులను అనసూయమ్మ (70), ఆమె కుమారుడు గోపాల్‌రెడ్డి (45) గా గుర్తించారు. వీరి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.