Andhra Pradesh: ఏపీలో ఎస్మా ప్రయోగం... కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • రాష్ట్రంలో ఆర్నెల్ల పాటు ఎస్మా అమలు
  • జీవో తీసుకువచ్చిన సర్కారు
  • ఎస్మా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
AP Government implements ESMA act

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్మా యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించాలని నిశ్చయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఆరు నెలల పాటు ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులను తీసుకువస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

ఈ జీవో అనుసరించి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది ఎస్మా పరిధిలోకి వస్తారు. అంతేకాదు, పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అత్యవసర సమయాల్లో పనిచేయని అధికారులను ఈ చట్టం ద్వారా శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

More Telugu News