తెలంగాణలో మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా... ఇవాళ ఇద్దరి మృతి

03-04-2020 Fri 20:41
  • రాష్ట్రంలో 11కి చేరిన కరోనా మరణాలు
  • ఇవాళ కొత్తగా 75 పాజిటివ్ కేసులు
  • ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 229
Two more corona deaths in Telangana

ప్రమాదకర కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 11కి పెరిగింది. షాద్ నగర్, సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అటు పాజిటివ్ కేసులు కూడా మరింతగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరింది. అటు, కరోనా నుంచి కోలుకుని నేడు 15 మంది డిశ్చార్జి అయ్యారు.