ప్రధాని పిలుపుకు తూట్లు పొడిచారు: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

03-04-2020 Fri 18:49
  • ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణ
  • నిత్యావసరాల ధరలు నియంత్రించాలని సూచన
  • ప్రభుత్వ విభాగాల మధ్య అవగాహన ఉండాలన్న చంద్రబాబు
TDP supremo writes CM Jagan over latest situations

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. ప్రధాని లాక్ డౌన్ పిలుపు ఇచ్చినా బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో యథేచ్చగా ఇసుక అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. కరోనా విజృంభిస్తోన్న ఎంతో క్లిష్ట సమయంలో కూడా ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియా ముమ్మరంగా తవ్వకాలు చేపడుతోందని మండిపడ్డారు.

ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలను అనుమతించడం ప్రధాని లాక్ డౌన్ పిలుపుకు తూట్లు పొడవడమేనని విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని, బ్లాక్ మార్కెట్ విక్రయాలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విభాగాల మధ్య అవగాహన లేకుండా కరోనా వ్యాప్తిని నిరోధించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.