దేశవ్యాప్తంగా 24 గంటల్లో 8000 శాంపిల్స్ పరీక్షించాం: ఐసీఎంఆర్

03-04-2020 Fri 18:08
  • దేశవ్యాప్తంగా 182 ల్యాబ్ లు పనిచేస్తున్నాయని వెల్లడి
  • వాటిలో 130 ప్రభుత్వ ల్యాబ్ లు
  • తమిళనాడులో కరోనా వ్యాప్తి మరింత తీవ్రం
  • కొత్తగా 102 కేసులు నమోదు
ICMR said eight thousand samples being tested across the country

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 182 ల్యాబ్ లు పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) సంస్థ వెల్లడించింది. వీటిలో 130 ప్రభుత్వ ల్యాబ్ లు అని ఐసీఎంఆర్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 8000 శాంపిల్స్ పరీక్షించామని తెలిపింది. అటు తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 102 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 411కి పెరిగింది.