Tamilisai Soundararajan: పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్

Telgangana Governer Tamilisai praises pawan kalyan
  • ‘పీఎం కేర్స్ ఫండ్’కు కోటి రూపాయలు పంపిన పవన్ కల్యాణ్
  • ఈ విషయాన్ని తన ట్వీట్ లో పేర్కొన్న పవన్
  • పవన్ ది పెద్ద మనసు అంటూ తమిళిసై ప్రశంసలు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక కోటి రూపాయల విరాళాన్ని ‘పీఎం కేర్స్ ఫండ్’కు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘కోవిడ్-19’ పై పోరాటానికి తాను  ప్రకటించిన రెండు కోట్ల రూపాయలలో భాగంగా ఈ రూ. కోటిని ’పీఎం కేర్స్ ఫండ్’కు ఇప్పుడే పంపించానంటూ కస్టమర్ అక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ ను తన పోస్ట్ లో జతపరిచారు.

ఈ పోస్ట్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ, పవన్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ చర్యలు లక్షలాది మంది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తాయని, దూరదృష్టి గల మన పీఎం ద్వారా  దేశానికి సాయపడుతున్న పవన్ పెద్ద మనసుకు ‘శాల్యూట్’ అంటూ కొనియాడారు.
Tamilisai Soundararajan
Governor
Telangana
Pawan Kalyan
Tollywood

More Telugu News