అజయ్ దేవగణ్ కు సారీ చెప్పిన 'ఆర్ ఆర్ ఆర్' టీమ్

03-04-2020 Fri 16:55
  • కీలక పాత్రను పోషిస్తున్న అజయ్ దేవగణ్ 
  •  నిన్న ఆయన పుట్టినరోజు
  • గర్వంగా ఉందన్న టీమ్
RRR team says sorry to Ajay Devagan

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక వీడియోను వదలగా అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

నిన్న అజయ్ దేవగణ్ పుట్టినరోజు అయినప్పటికీ, ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. ఈ విషయంపైనే రాజమౌళి టీమ్ అజయ్ దేవగణ్ కి సారీ చెప్పింది. అజయ్ దేవగణ్ బర్త్ డే సందర్భంగా ప్లాన్ చేసిన వీడియోను కొన్ని సాంకేతిక కారణాల వలన విడుదల చేయలేకపోయినట్టు ట్వీట్ చేస్తూ క్షమించమని కోరింది. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందంటూ, ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది.