Yogi Adityanath: తబ్లిగీ సభ్యులపై యూపీ సీఎం ఆగ్రహం.. ఎన్ఎస్ఏ కింద కేసులకు ఆదేశం

  • ఘజియాబాద్ లో తబ్లిగీలకు క్వారంటైన్
  • నర్సులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడికి దిగిన తబ్లిగీలు
  • వారు మానవాళికి శత్రువులన్న సీఎం  
UP CM Yogi Adithyanath fires on who attacked on Nurses

కొన్నిరోజుల కిందట ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించిన మత సమ్మేళనానికి దేశవ్యాప్తంగా వందల మంది హాజరయ్యారు. వారిలో కొందరు కరోనా బారినపడడంతో మరికొందరిని ముందు జాగ్రత్తగా అధికారులు క్వారంటైన్ కు తరలించారు. అయితే, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో తబ్లిగీ సభ్యులు నర్సులు, ఇతర వైద్యసిబ్బందిపై దాడికి దిగారు.

 ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. వైద్యసిబ్బందిపై దాడి చేసినవాళ్లను "మానవాళికి శత్రువులు"గా అభివర్ణించారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. "వారు చట్టాన్ని గౌరవించరు, ప్రభుత్వ ఆదేశాలను అంతకన్నా పాటించరు. ఇలాంటివాళ్లతో మనుషులకు ముప్పు ఉంటుంది. మహిళా వైద్య సిబ్బందిపై వారు దాడికి పాల్పడడం తీవ్ర నేరం. వారిని వదిలిపెట్టేది లేదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News