‘పీఎం కేర్స్ ఫండ్’కు సుప్రీంకోర్టు అఫిషియల్స్ విరాళం

03-04-2020 Fri 16:11
  • ‘కరోనా’పై పోరాటానికి విరాళం
  • తమ వంతు మద్దతుగా నిలిచిన ‘సుప్రీంకోర్టు’ అధికారులు
  • ‘పీఎం కేర్స్ ఫండ్’ విరాళంగా రూ.1,00,61,989  
supreme court officials announced their donation to fight against corona

‘కరోనా’ మహమ్మారిని కట్టడి చేసేందుకు చేస్తున్న పోరాటానికి వ్యాపార, సినీ రంగ ప్రముఖులు సహా పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నాయి. తాజాగా,  భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉద్యోగులు కూడా తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ‘పీఎం కేర్స్ ఫండ్’ కు సుప్రీంకోర్టు ఉద్యోగులు తమ వంతు విరాళంగా రూ.1,00,61,989 ప్రకటించారు.