నేను ట్యూన్ కట్టిన తొలిపాట అదే: శ్రీలేఖ

03-04-2020 Fri 16:02
  • ఎనిదేళ్ల వయసులో ట్యూన్ కట్టాను 
  • 'ఎస్.పి. పరశురామ్ కోసం తీసుకున్నారు
  • ఆమెను చూస్తుండిపోయేదాన్నన్న శ్రీలేఖ 
SP Prashuram Movie

ఓ ఇంటర్వ్యూలో శ్రీలేఖ మాట్లాడుతూ, తన తొలిపాటను గురించి ప్రస్తావించారు. 'నేను తొలిపాటను కంపోజ్ చేసినప్పుడు నాకు ఎనిమిదేళ్లు. 'ఏడవకేడవకేడవకమ్మా .. అమ్మకు ప్రాణం నువ్వేనమ్మా' అంటూ ఆ పాట సాగుతుంది. కొన్నాళ్ల తరువాత కీరవాణి అన్నయ్య ఆ పాటను 'ఎస్.పి. పరశురామ్ సినిమా కోసం తీసుకున్నాడు.

 అప్పటి వరకూ ఆయన చేసిన కొన్ని ట్యూన్స్ దర్శకుడికి సంతృప్తిని ఇవ్వకపోవడంతో, ఆయన ఈ సాంగ్ ను తీసుకున్నాడు. చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్లోనే నా తొలి పాట ఉండటం ఆనందాన్ని కలిగించింది. అమ్మవారే నాతో ఆ పాటను చేయించిందని ఇప్పటికీ అనుకుంటూ వుంటాను. శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి శ్రీదేవితో 'క్షణ క్షణం' సినిమా కోసం చాలా రోజులు గడిపాను. ఆమె పక్కనే కూర్చుని అలా చూస్తుండిపోయేదానిని. ఆమె చాలా చనువుగా .. ఆత్మీయంగా మాట్లాడేది" అని చెప్పుకొచ్చారు.