‘కరోనా’తో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలి: పీవీ సింధు పిలుపు

PV Sindhu says we fight together to control corona virus
కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యపరుస్తూ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఓ వీడియో సందేశం పంపారు. బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కోర్టులోనే ఆడాలని, అప్పుడే గెలుస్తామని, ‘కరోనా’తో ఫైట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తేనే కోవిడ్-19 పై మనం విజయం సాధించగలమంటూ ఓ పోస్ట్ చేసింది. ‘కరోనా’ కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేసిన సూచనలను పాటిద్దామని, ‘ఇంట్లో ఉందాం..‘కరోనా’ ను కలిసి ఎదుర్కొందాం’ అని పిలుపు నిచ్చింది.
Go Back to Shorts
PV Sindhu
Badminton
Corona Virus
video
message

More Telugu News