తనయతో కలిసి సినిమాలు చూస్తూ ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు

03-04-2020 Fri 14:48
  • షూటింగ్ లు లేక ఇంటికే పరిమితమైన మహేశ్ బాబు
  • కుమార్తె సితారతో కలిసి స్టూవర్ట్ లిటిల్ సినిమా చూస్తున్నట్టు ట్వీట్
  • ఇంటి వద్దే ఉంటూ కరోనా నుంచి కాపాడుకోవాలని పిలుపు
Mahesh Babu enjoys lock down period by watching movies along with daughter

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ కాలాన్ని తన కుమార్తె సితారతో కలిసి బాగా ఆస్వాదిస్తున్నాడు. షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన మహేశ్ బాబు తనయతో కలిసి తాజాగా స్టూవర్ట్ లిటిల్ అనే సినిమా వీక్షిస్తూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు.

"ఇది తండ్రీకుమార్తెలకు ప్రత్యేకం! స్టూవర్ట్ లిటిల్ పార్ట్ వన్ వస్తోంది. రేపు పార్ట్ 2 వరకు వేచి ఉండలేం! మనందరం ఇంటివద్ద ఏదో ఒకటి చేసేందుకు ఆలోచిస్తూనే ఉండాలి. మనకిష్టమైన వాళ్లు ఎలాగూ మనల్ని వదిలిపెట్టరు కదా!" అంటూ స్పందించారు. అంతేకాదు, ఇంటివద్దే ఉండడం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.