ప్రధాని పిలుపుని గౌరవిద్దాం.. ఆ రోజు దీపాలు వెలిగిద్దాం: సినీ హీరో చిరంజీవి

03-04-2020 Fri 14:36
  • మోదీ పిలుపుపై  చిరంజీవి స్పందన
  • ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పివేద్దాం
  • ‘కరోనా’ చీకట్లను పారద్రోలుదాం..దేశం కోసం నిలబడదాం
Chiranjeevi says respecting our beloved PMs call

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరులో భారతజాతి మొత్తం ఏకతాటిపై ఉందన్న విషయాన్ని మరోసారి తెలియజేసే నిమిత్తం ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇళ్లల్లోని విద్యుత్ లైట్లను అన్నిటినీ ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే.

మోదీ పిలుపుపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. మన ప్రియతమ ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామని, ఆ సమయానికి అందరం దీపాలు వెలిగిద్దామని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘కరోనా’ చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు.