Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... హాట్ స్పాట్ లు ఇవే!

6 Corona virus hot spots identified in Telangana
  • తెలంగాణలో 161కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు
  • 9 మంది మరణం
  • ఢిల్లీ నుంచి వచ్చిన వారితో పెరిగిన కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 154 కేసులు నమోదు కాగా... 9 మంది మరణించారు. ఏపీలో కేసుల సంఖ్య 161కి చేరుకోగా... ఒక మరణం సంభవించింది. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు లింకుతో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది.

మరోవైపు నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో మొత్తం 6 ప్రాంతాల్లో వీరు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీ, భైంసా, నిర్మల్, నిజామాబాద్, గద్వాల్, మిర్యాలగూడ ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. హాట్ స్పాట్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. అక్కడి వారిని బయటకు పంపించడం లేదు.
Telangana
Corona Virus
Hot Spots

More Telugu News