Hyderabad: హైదరాబాద్‌లో వలస కూలీలను ఆదుకునేందుకు 'కోవిడ్-19 సహాయ'

covid 19 to assist daily labour in hyderabad
  • తెలంగాణ స్వచ్చంద సంస్థలు, సామాజిక, ప్రజా సంఘాల నిర్ణయం 
  • ఉపాధి లేనందుకు కూలీలకు రేషన్ పంపిణీ 
  • హైదరాబాద్‌లో దాదాపు 25 వేల మంది కూలీలు

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక వలస కార్మికులు అల్లాడిపోతున్నారు. వున్న చోట పనిలేక, ఊరెళదామంటే ప్రయాణ సౌకర్యం లేక అర్ధాకలి, పస్తులతో కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని స్వచ్చంద సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు ఒక్కటిగా ఏర్పడి 'కోవిడ్-19 సహాయ' కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 

ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు, ప్రభుత్వ సాయంతో వలస కార్మికులకు నిత్యావసరాలు అందించాలని నిర్ణయించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 25 వేల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. వీరిలో 16 వేల మంది తక్షణ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారి కోసం పని చేయాలని ఈ కార్యక్రమం చేపట్టారు. విషయాన్ని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారు కూడా సానుకూలంగా స్పందించడంతో ముందడుగు వేస్తున్నారు.

Hyderabad
covid 19
daily labour

More Telugu News