America: ఉగ్రవాదికి విధించిన మరణశిక్ష రద్దు.. పాక్ పై మండిపడిన అమెరికా!

  • అమెరికన్ జర్నలిస్ట్ పెర్ల్‌ను హత్య చేసిన ఉగ్రవాదికి గతంలో మరణశిక్ష
  • దానిని ఏడేళ్ల సాధారణ శిక్షగా మార్చిన సింధ్ కోర్టు
  • పాక్ కాలయాపన చేసిందన్న అమెరికా
Pakistani court over turns convictions in kiling of Daniel pearl

పాకిస్థాన్ తీరుపై అమెరికా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద బాధితులను ఆ దేశం అగౌరవపరిచిందని ఆరోపించింది. అమెరికన్ జర్నలిస్టు డేనియల్ పెర్ల్‌ను హత్యచేసిన ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్‌కు గతంలో విధించిన మరణశిక్షను ఏడేళ్ల సాధారణ శిక్షగా మార్చడాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

పెర్ల్‌ను హత్య చేసిన ఉగ్రవాది గత 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సింధ్ కోర్టు నిన్న షేక్ మరణశిక్షను ఏడేళ్ల సాధారణ శిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. విషయం బయటకు వచ్చిన వెంటనే అమెరికా స్పందించింది. ఉగ్రవాదికి విధించిన మరణశిక్షను అమలు చేయకుండా సుదీర్ఘకాలంపాటు కాలయాపన చేసి ఇప్పుడు దానిని సాధారణ శిక్షగా మార్చడంపై మండిపడింది. పాక్ చర్య ఉగ్రవాద బాధితులను అగౌరవపరిచేలా ఉందని అమెరికా విదేశాంగశాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News