రైల్వే బుకింగ్స్‌పై కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదు: రైల్వే శాఖ వివరణ
- లాక్‌డౌన్ తర్వాత ప్రయాణాలకు బుకింగ్స్ మొదలయ్యాయని వార్తలు
- ఆ ప్రక్రియ ఎప్పుడూ నిలిపివేయలేదన్న రైల్వే శాఖ
- 120 రోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చని స్పష్టం
ఏప్రిల్ 14వ తర్వాతి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్స్‌ను తాము నిలిపివేయనే లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. కేవలం లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయానికి అంటే మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీ మధ్యలో ప్రయాణాల బుకింగ్స్‌ను మాత్రమే నిలిపివేశామని చెప్పింది. రైల్వే టికెట్ల కోసం 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. అందువల్ల ఏప్రిల్ 15 తర్వాత జరిగే ప్రయాణాల కోసం లాక్‌డౌన్ విధించే చాలా రోజుల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్‌గా ఉన్నాయని పేర్కొన్నది.