CRDA Bill: పేదలకు ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీఏ మాస్టర్ ప్లానులో మార్పులు!

  • పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం
  • హైకోర్టు తీర్పును అనుసరించి స్థలాల పంపిణీ
  •  కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు 
AP Government ready to make changes in CRDA master plan

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా అవసరమైతే సీఆర్డీయే మాస్టర్ ప్లానులో మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు తీర్పును అనుసరించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల పథకం వర్తింపచేయాలంటూ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. రాజధాని పరిధిలో పేదలకు ఇళ్ల కోసం 1251.51 ఎకరాలు కేటాయించాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. మాస్టర్ ప్లానులో మార్పులు సీఆర్డీయే చట్టం పరిధిలోనే  ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ఈ ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో ఇంతకుముందు ఏపీ సర్కారు 107 జీవో జారీ చేసింది. ఈ జీవోను అనుసరించి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, పెదకాకాని, దుగ్గిరాల, తాడేపల్లి ప్రాంతాల్లోని 51 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

అయితే, రాజధానిలో ఉండే ఇళ్లు లేనివారికే స్థలాలు ఇవ్వాలని, రాజధాని వెలుపల ఉండే 29 గ్రామాల వారికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారంటూ రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు 107 జీవోను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరో జీవో జారీచేసి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధమైంది.

More Telugu News