Minister: వాళ్లు అజ్ఞానులే కాదు, వారి వల్ల ఇతరులకూ ప్రమాదమే: మంత్రి కేటీఆర్

  • గాంధీ వైద్యులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి
  • నిజామాబాద్‌లో వైద్య సిబ్బంది అడ్డగింతపై కూడా ఆగ్రహం
  • అలాంటి వారిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక
These individuals are not only ignorant but they are a potential hazard to others also says KTR

కరోనా వైరస్‌ బాధితులను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వారి విధులకు అడ్డు పడుతున్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని తెలంగాణ ఐటీ, ముస్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గురువారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ‘గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు, వారివల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News