Kurnool District: మరో వివాదంలో చిక్కుకున్న రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ!

Rudravaram SI Vishnu narayana Contravarsy
  • గత నెలలో అదృశ్యమై కలకలం రేపిన నారాయణ
  • తాజాగా నాగులవరం గ్రామంలో హల్ చల్
  • చిల్లర కొట్టు యజమానిపై ప్రతాపం చూపిన ఎస్ఐ
కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ఐ విష్ణు నారాయణ పేరు గుర్తుందా? గత నెలలో తనను అధికారులు మందలించారన్న మనస్తాపంతో , ఇదే తన చివరి మెసేజ్ అంటూ వాట్సాప్ లో సమాచారాన్ని ఇచ్చి అదృశ్యమైన పోలీసు అధికారి. అతని మెసేజ్ తో కంగారుపడిన అధికారులు, గాలింపు చర్యలు చేపట్టగా, తీరిగ్గా బయటకు వచ్చాడు.

ఇప్పుడా విష్ణు నారాయణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ విధుల్లో ఉన్న విష్ణు, నాగులవరం గ్రామంలో ఓ చిల్లర కొట్టు యజమానిని చితకబాదాడు. అతని షాపులోని సరుకులను వీధిలో పడేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా, అది వైరల్ అయింది. ఎస్ఐ చర్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్థానికులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Kurnool District
Rudravaram
SI
Vishnu Narayana

More Telugu News