Donald Trump: దాడులు చేయాలనుకుంటున్నారు.. భారీ మూల్యం చెల్లించుకుంటారు: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • ఇరాన్‌ చర్యలపై ట్రంప్ ఆగ్రహం
  • అమెరికా ఆస్తులపై దాడికి ప్రణాళిక వేస్తున్నారని వ్యాఖ్య
  • ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు
trump warns iran

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు ఇరాక్ లోని అమెరికా సైనిక బలగాలపైన, ఆస్తులపైనా దాడి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇరాన్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు జరపుతోందంటూ అమెరికా ఆంక్షలు విధించడం, ఆ తర్వాత మాటల యుద్ధం కొనసాగడం వంటి పరిస్థితులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. మూడు నెలల క్రితం బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా రాకెట్‌ దాడులు జరిపి ఖాసీం సులేమానీని చంపడంతో పరిస్థితులు మరింత చేజారాయి. దీంతో ఇరాక్ ‌లోని అమెరికా ఆస్తులపై దాడులు జరిగాయి. మరోసారి ఇలాంటి దాడులు చేయాలని ఇరాన్‌ ప్రయత్నిస్తోందని ట్రంప్‌ చెప్పారు.

More Telugu News