Guntur District: మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్.. మంగళగిరిలో హై అలెర్ట్!

  • బాధితుడి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటన
  • కూరగాయల దుకాణాలు, షాపులు మూసివేత
  • గుంటూరులో అత్యధికంగా 20 కేసులు
Mangalagiri man tested positive high alert in town

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగళగిరి వ్యక్తికి గతరాత్రి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు.

అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. కాగా, నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

More Telugu News