Dharavi: ముంబయి మురికివాడలో కరోనా మరణం... ఉలిక్కిపడిన అధికారగణం!

  • ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ధారావి
  • కిక్కిరిసిన ఇళ్ల మధ్య 16 లక్షల మంది నివాసం
  • కరోనా విస్తరిస్తే పరిస్థితి కష్టమంటున్న అధికారులు
First corona Death in Dharavi

అది ముంబయిలోని ధారావి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ!
కిక్కిరిసి ఉండే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య, ఇక్కడ లక్షలాది పేదలు నివాసం ఉంటుంటారు. ఇక్కడ జనసాంధ్రత అత్యధికం కాగా, పారిశుద్ధ్యం అంతంతమాత్రం.

  ఈ ధారావిలో 56 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి మరణించడంతో అక్కడి అధికారగణం ఉలిక్కిపడింది. ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, దానిని అడ్డుకునే పరిస్థితి చాలా కష్టమని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ధారావిలో బుధవారం సాయంకాలం ఈ తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న అతని రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, పోలీసులు, మునిసిపల్ అధికారులు హుటాహుటిన వెళ్లి అతను ఉంటున్న భవనాన్ని సీల్ చేసి, భవనంలో అద్దె కుంటున్న 300 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, ఆగ్రహంతో వారిపై రాళ్లు కూడా రువ్వడం జరిగింది.

కాగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు.

More Telugu News