China: కుక్కలు, పిల్లులను తినడంపై షెంజెన్‌లో శాశ్వత నిషేధం.. చైనాలోనే తొలినగరంగా రికార్డు!

Shenzhen becomes first city in china to ban dogs cats meat
  • పలు జంతువుల మాంస వినియోగంపై షెంజన్‌లో నిషేధం
  • పెంపకంపైనా ఆంక్షలు
  • మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి
కరోనా వైరస్ దెబ్బతో చైనా పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. దేశంలో తొలిసారి షెన్‌జెన్ నగరంలో కుక్కలు, పిల్లుల మాంసం తినడాన్ని నిషేధించింది. మే ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. కొత్త చట్టం ప్రకారం పిల్లులు, కుక్కలు, పాములు, బల్లులు, రక్షిత వన్యప్రాణులు తినడం నిషేధం. అలాగే, వాటి పెంపకం, విక్రయాలను కూడా నిషేధించినట్టు ప్రభుత్వం పేర్కొంది.

 కరోనా వైరస్ ప్రబలి ప్రపంచం మొత్తం దాని బారినపడడానికి గల కారణాల్లో వీటి మాంసం తినడం కూడా ఒకటన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 1.50 లక్షల యువాన్ల భారీ జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.

అయితే, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలు తదితర వాటికి మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు లభించింది. కాగా, వూహాన్‌లో జంతువధశాల కేంద్రంగా ప్రాణాంతక  వైరస్ పురుడుపోసుకున్న నేపథ్యంలో తైవాన్, హాంకాంగ్‌లో ఇప్పటికే కుక్కలు, పిల్లుల మాంసంపై నిషేధం అమల్లో ఉంది.
China
shenzhen
dogs
cats
Corona Virus

More Telugu News